రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అన్ని వైపుల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయని…. అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నన్ను నేరుగా కలిసి అభినందించాలని కోరుకుంటున్నారని, త్వరలోనే జిల్లాల వారీగా అందరినీ కలిసి మాట్లాడతానని పవన్ కల్యాణ్ అన్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను జనసేన ప్రధాన కార్యాలయం నుంచి విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ నెల 20 తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. పిఠాపురం ప్రజలు నన్ను అఖండ మెజారిటీతో గెలిపించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో కలుస్తాను.. ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను… అని పవన్ తెలిపారు.