అనంతలో ప్రొబిషన్ డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్
డిజిపితో పాటు పాల్గొన్న హోంమంత్రి
నేరస్థులు అప్ డేట్ అవుతున్నారు..
పోలీస్ లు కూడా వారి కంటే ముందే ఉండాలి
విధులలో దుష్ప శిక్షణ, శిష్ట రక్షణ ఉండాలి
అనంతపురం – శాంతి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. అనంతపురంలో ప్రొబిషన్ డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ లో హోం మంత్రి అనితతో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. . ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీల నుంచి గౌరవ వందనం స్వీకరించారు హోం మంత్రి.. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీఎస్పీలకు పథకాలను ఈ సందర్భంగా అందించారు హోం.
అనంతరం అనిత మాట్లాడుతూ.. మహిళలు, చిన్న పిల్లలపై ఆఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. .. ఇవాళ నేరస్థులు కూడా పోలీసులకు దొరక్కుండా అప్ డేట్ అవుతున్నారని చెప్పారు.. .. ఈ రోజు మనం అప్పాను కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఉందన్నారు.. అయితే, లా అండ్ ఆర్డర్ ను పటిష్ఠం చేయాలని అంటూ మన ముందు చాలా టాస్క్ లు ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ శాంతి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు..
ప్రతి జిల్లాల్లో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు..
ప్రతి జిల్లాల్లో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు కోసం ఆలోచిస్తున్నామని చెప్పారు… ఆర్థిక, రాజకీయ, గంజాయి ముసుగులో అనేక ఉన్మాదాలు జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. పోలీస్ యూనిఫాం వేసుకున్నందుకు గర్వ పడండి.. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించండి అంటూ ట్రైనింగ్ పూర్తిచేసుకున్న డీఎస్పీలకు సూచించారు హోంశాఖ.
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ..
ఈ కార్యక్రమంలో డీజీపీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. రెండూ ఉండాలి అంటూ డ్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీలకు సూచించారు ఏపీ డీజీపీ . త్వరలో అమరావతిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు.. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీలు విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.