విజయవాడ, ఆంధ్రప్రభ:రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్స్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేలా చేశాం. స్వర్ణాంధ్ర విజన్ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
జీరో పావర్టీ దిశగా.. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే మా నినాదం అని గవర్నర్ అన్నారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. పరిశ్రమల అవసరాలు తీర్చేలా నీరు అందిస్తాం. రైతులకు పుష్కలంగా సాగునీరు అందిస్తున్నాం’ అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. జీరో పావర్టీ దిశగా అనేక పథకాలు అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు.
పీ-4 విధానం ద్వారా రాష్ట్రంలో పెనుమార్పులు తెస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన..
ఈ సందర్భంగా పరిశ్రమలు, పర్యాటక, సెర్ప్, గృహనిర్మాణ శాఖ , పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ శకటాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఆరోగ్యశాఖ, మహిళాశిశు సంక్షేమం, జలవనరుల శాఖ, అటవీ, వ్యవసాయ, మత్స్య శాఖ , ఏపీసీఆర్‌డీఏ, పంచాయతీరాజ్, ఇంధనశాఖ ఉద్యాన, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, ఆర్‌టీజీఎస్ శకటాలు ఆకట్టుకున్నాయి.
అనంతరం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. .