అమరావతి – ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విజయనగరం షెడ్యుల్ రద్దు అయ్యింది..
దీంతో రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం అనకాపల్లి జిల్లాకు మారింది. శ్రీకాకుళం నుంచి నేరుగా పరవాడ ఫార్మా సిటీలోని లారస్ ఫార్మా కంపెనీ అడ్మిన్ బిల్డింగ్ కు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ అధికారులతో సమీక్ష, ఫొటో ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు చంద్రబాబు.
అక్కడ నుంచి వెన్నెల పాలెం గ్రామానికి చేరుకుని రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రుషికొండకు చేరుకుంటారు ఏపీ సీఎం.. గత ప్రభుత్వం నిర్మించిన వివాదాస్పద టూరిజం భావనల్ని పరిశీలిస్తారు. సుమారు 500కోట్ల రూపాయలతో కట్టిన ఈ భావనాలను ఏ విధంగా వినియోగంలోకి తేవాలనే కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకస్మికంగా వెళ్లి ఆ భవనాలను పరిశీలించిన విషయం విదితమే.
ఇక, ఇప్పుడు సీఎం చంద్రబాబు షెడ్యుల్ లో మార్పులు చోటు చేసుకోగా.. రుషికొండ యాడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయిలో రుషికొండ భవనాలపై కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 100 రోజుల ప్రభుత్వ పాలన , విశాఖ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ఎలివెటెడ్ కారిడార్ ల నిర్మాణం, వైజాగ్ మెట్రో, నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంటు, వైజాగ్ ఐటీ వంటి కీలకమైన అంశాలపై సమీక్ష జరిగే అవకాశం వుంది.