Thursday, November 28, 2024

AP | జాలువారే జలపాతం.. బ‌ట్రేప‌ల్లి అడ‌వుల్లో ప్ర‌కృతి సుంద‌రం

ఆంధ్రప్రభ స్మార్ట్, శ్రీ సత్యసాయి జిల్లా : ఇది కరవు నేల. వానకు ఎన్నాళ్లు గుర్తొస్తుందో తెలీదు. కానీ వరుణుడు కరుణించాడో.. ఈ నేల పరవశించి పోతుంది. జనం మది ఉరకలెత్తుంది. జలపాతంలో ఆ పాత మధురానుభూతితో సేదతీరుతారు. శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నుంచి – పులి వెందులకు వెళ్లే రోడ్డు లోని బట్రేపల్లి అడవుల్లో ఈ పకృతి సుందర దృశ్యమాలిక పలకరిస్తోంది.

ఇటీవల భారీ వర్షాలకు బట్రేపల్లి జలపాతం సొగసుతీరా జాలువారుతోంది. పర్యాటకులను పరుగులు పెట్టిస్తోంది. బట్రేపల్లి జలపాతంలో యువజనం కేరింతలు కొడుతోంది. పెద్దలు తనివి తీరా జలకాటల్లో ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. చిన్నపాటి కొలనులో ఈదులాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement