Friday, October 18, 2024

Ap: దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ టీడీపీ.. చంద్రబాబు

ఎవరూ జోక్యం చేసుకోకండి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు ‘సీఎం. చంద్రబాబు హెచ్చరిక
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ కు కలిపి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తాను సీఎంగా ఉన్న కాలంలో ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితుల్ని చూడలేదన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించి, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో పార్టీని ముందుకెలా తీసుకెళ్లాలన్న దానిపై సమీక్షించాలని పార్టీ నేతలకు సూచించారు.

అలాగే.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో భాగస్వామ్యంగా ఉన్నామని, మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ప్రాంతీయ పార్టీ టీడీపీ అని చెప్పారు. టీడీపీకి విశ్వసనీయత ఉందన్న చంద్రబాబు.. తాము అధికారం కోసం కాకుండా దేశం కోసం పనిచేశామని పేర్కొన్నారు. ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా తాము పదవులు అడగలేదన్నారు. కూటమి అధికారంలోకి రావడానికి క్యాడర్ చాలా త్యాగాలు చేసిందని, వారందరినీ అభినందిస్తున్నానని తెలిపారు. హర్యానాలో ఐదుగంటలపాటు జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు చెప్పారు. కేడర్ లో భారీ అంచనాలున్నాయని, అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.లిక్కర్ వ్యాపారంలో టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. శుక్రవారం పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎంతో శ్రమించారు. త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారు.. చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది.. అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా.. ఎవరినైనా తిట్టినా సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్‌ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.

మద్యం వ్యాపారాలకు దూరంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని చెప్పారు. వైసీపీ హయాంలో చేసిన తప్పులే వారిని అధికారానికి దూరం చేసాయని అన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వలనే బడుమేరు పొంగి విజయవాడకు వరదలు వచ్చాయని చెప్పారు. వరద బాధితులకు సాయం కోసం కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. 2029లోనూ గెలుపు కోసం మిత్రపక్షాలతో సమన్వయం ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈసారి ఏపీలో కరువుకు ఆస్కారం లేదన్నారు. కేంద్రం, ఏపీలో చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement