Sunday, January 5, 2025

AP – ఆనందం స్వామిజీల ద్వారానే ల‌భ్యం – చంద్ర‌బాబు

విజ‌య‌వాడ – సంపద సృష్టించినా ఆనందంగా ఉండటం ముఖ్యమన్నారు ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆనందంగా ఉండాలంటే స్వామీజీల వల్ల సాధ్యమవుతుందని అన్నారు. విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపట్టిన ఆంద్రప్రదేశ్ 42 ఊర్లలో దత్తక్షేత్ర నాద యాత్ర- 2025ను నేడు ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… విజన్ 2020 అంటే అప్పట్లో అందరికి అర్ధం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతోందన్నారు. ఇపుడు విజన్ 2047 కోసం పనిచేస్తున్నానని తెలిపారు. ‘‘స్వర్ణాంధ్ర నా సంకల్పం’’ అని అన్నారు.

స్వామీజీపై పెట్టిన నమ్మకంతో కొత్త పాలకులైన తనపై పెడితే స్వర్ణాంధ్ర సాధిస్తామని అన్నారు. అందరూ యదార్థాలని కూడా చెప్పేలా ఉండాలని.. ప్రతి ఒక్కరికీ స్పిరిచాలిటీ ఉండాలని తెలిపారు. భగవంతుని ఆశీస్సులు మనకి ఉండాలన్నారు. గణపతి సచ్చిదానంద ఆశీస్సులు తీసుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నపుడు పూజ చేసి ఫలితాన్ని తన చేతికి ఇచ్చారన్నారు. మంచికోసం స్వామీజీ పరితపిస్తారని కొనియాడారు. స్వామీజీ ని ఎప్పుడు కలిసినా మనశాంతి దొరుకుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement