Tuesday, November 19, 2024

ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేస్తున్నాయి

ఏపీ టెన్త్ ఫలితాల విడుదలపై మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం కీలక ప్రకటన చేశారు. 2, 3 రోజుల్లో టెన్త్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా వల్ల పరీక్షలు రద్దు చేయడంతో విద్యార్థులంతా పాసైనట్లేనని ఈ సందర్భంగా ఆయన తీపికబురు అందించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 2020, 2021 సంవత్సరాల్లో పదవ తరగతి విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.

స్లిప్ టెస్టులకు 70%, ఫార్మాటివ్ ఎసెస్ మెంట్ కు 30% వెయిటేజ్ తో మార్కుల కేటాయింపులు ఇచ్చామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఛాయారతన్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్న ఆయన… 6.28 లక్షల మంది విద్యార్థులు ఫలితాలు విడుదల చేయనున్నామరి వెల్లడించారు. ఎంసెట్ ర్యాంకింగులో ఇంటర్మీడియట్‌కు ఇచ్చే 25 శాతం వెయిటేజ్ ఈ ఏడాది ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా గత వారమే ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: షాకింగ్.. గేదె మాంసంలో కరోనా మూలాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement