Sunday, November 24, 2024

AP – విశాఖలో రైల్వే జోన్ – భవనాల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానం

విశాఖ :దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. విశాఖలో జోనల్‌ కార్యాలయ నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, రెండు సెల్లార్‌ పార్కింగ్‌ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11అంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. జీఎం కార్యాలయం సహా ఇతర పరిపాలన భవనాలు ఇందులో ఉండనున్నాయి.

విశాఖ రైల్వే జోన్ భూ కేటాయింపు చేసేందుకు జ‌గ‌న్ హ‌యాంలో వైసీపీ స‌ర్కారు ఆల‌స్యం చేసింది. రెండేండ్ల వ్య‌వ‌ధిలో ప‌నులు పూర్త‌య్యేలా..అయితే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది. దీంతో జోన్‌ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ₹149.16 కోట్ల అంచనా వ్యయంతో భవనం నిర్మించనున్నారు. డిసెంబర్‌ 27లోపు టెండర్లు దాఖలు చేయాలని రైల్వేశాఖ తెలిపింది. టెండర్లు దక్కించుకున్న వారు రెండు సంవత్సరాల్లో పూర్తిచేయాలని నిర్దేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement