Saturday, November 23, 2024

కాసేపట్లో ప్రారంభం కానున్న గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు లెక్కింపు చేపట్టనున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ జరగనున్న గుంటూరు ఏసీ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. 93.06 శాతం ఓట్లు పోలైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఓట్లు 13,505 కాగా… 12,556 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ స్థానం కోసం 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement