Wednesday, January 1, 2025

AP – మద్యం మత్తులో కుమారుడి ప్రాణం తీసిన తండ్రి

నర్సీపట్నం, డిసెంబర్ 29 (ఆంధ్రప్రభ స్మార్ట్) : మున్సిపాలిటీ వెంకునాయుడుపేట శివారు లక్ష్మీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును తండ్రి మద్యం మత్తులో హత్య చేసిన ఘటన ఆదివారం ఉదయం కలకలం రేపింది. కొఠారి రమణ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, తన కన్న కొడుకు కొఠారి భాస్కర్ ను సన్నికాలి రాయితో తల మీద కొట్టి హత్య చేశాడు.

టౌన్ సిఐ గోవిందరావు తెలిపిన వివరాలు ప్రకారం కొఠారి రమణ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడు. ఆయన భార్య మరణించి చాలా కాలమైంది. ఆయనకి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిగి నర్సీపట్నంలో వేరే దగ్గర కాపురం ఉంటుంది. కుమారుడు భాస్కర్ ఖాళీగా ఉంటూ తండ్రి మీద ఆధారపడి జీవిస్తున్నాడు.

అయితే గత కొద్దికాలంగా భాస్కర్ దుబారా ఖర్చు చేస్తున్నాడని తండ్రి కొడుకుల మధ్య కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం భాస్కర్ తన మిత్రుడుతో కలిసి బయట మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తిరిగి ఇంట్లో తండ్రితో సహా భాస్కర్ స్నేహితుడితో కలిసి మద్యం సేవించాడు. రాత్రి 10 గంటల సమయంలో మిత్రుడు వెళ్లిపోయిన తర్వాత తండ్రి కొడుకులు మధ్య పెద్ద వాగ్వాదం నడిచింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ జరగడంతో తండ్రి ఆవేశంతో ఇంట్లో ఉన్న రాయితో భాస్కర్ తల మీద కొట్టాడు.

జరిగిన ఘటనలో అక్కడక్కడే భాస్కర్ మరణించాడు. అయితే భాస్కర్ మరణించిన విషయం తెలియని తండ్రి నిద్రపోయాడు. ఇంట్లో తండ్రి కొడుకు మాత్రమే ఉండడంతో ఆదివారం ఉదయం పని మనిషి వచ్చి చూసేంతవరకు విషయం వెలుగులోకి రాలేదు.

- Advertisement -

ఇరుగు పొరుగు ద్వారా సమాచారం అందుకున్న కుమార్తె పార్వతి ఘటన స్థలానికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు రమణను అదుపులో తీసుకున్నామని టౌన్ సిఐ గోవిందరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement