Tuesday, November 26, 2024

AP – ఎస్సీ ఎస్టీలకు సౌర విద్యుత్ – చంద్రబాబు

పాడేరు, (ఏఎస్ఆర్ జిల్లా ), నవంబరు 25 : పేద షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల లబ్దిదారులకు సౌర విద్యుత్తు అందించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఐటిడి ఏ పి ఓలు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, ఎపి ఇపిడిసి ఎల్ అధికారులతో అమరావతి నుండి సోమవారం సోలార్ విద్యుత్తు సౌకర్యం, రాయితీలు పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీ ఎం మాట్లాడుతూ 200 యూనిట్లు లోపు వినియోగిస్తున్న లబ్దిదారులకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నామన్నారు. సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపించే లబ్దిదారులకు రాయితీలు అందిస్తామన్నారు. లబ్దిదారులకు ఇంటి పైకప్పుపై సోలార్ ప్లేటులు ఏర్పాటు చేయడానికి అవసరమై స్థలం ఉండాలన్నారు. 1 కిలో వాట్ సౌర విద్యుత్తు ఏర్పాటు చేయడానికి రూ.50 వేలు ఖర్చవుతుందని రూ.30 రాయితీ అందిస్తామని రూ.20 వేలు చెల్లించాలని అన్నారు. 2 కిలో వాట్ల సోలార్ కు రూ.60 వేలు రాయితీ, రూ.40 వేలు లబ్దిదారుని వాటాగా చెల్లించవలసి ఉంటుందన్నారు. 3 కిలో వాట్ల పై బడిన సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేసుకునే వారికి రూ.78 రాయితీ ఇస్తామని రూ.1లక్ష 45 వేలు లబ్దిదారుడు చెల్లించాలన్నారు.

- Advertisement -

ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్, ఐటిడిఏ పి ఓ వి. అభిషేక్, ఎపి ఇపిడి సి ఎల్ ఎస్. ఇ. జి. ఎన్. ప్రసాద్, డి. ఇ. ఇ డి. భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement