Ongole – ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు మరోసారి భయాందోళనకు గురిచేశాయి. ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం10.40గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.
భయంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. శనివారం 10.35గంటల సమయంలో ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, కురిచేడు మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. నిన్న రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది.
గుండ్లకమ్మ నది స్వరూపంలో చోటు చేసుకుంటున్న అంతర్గత మార్పుల కారణంగా భూమి కంపిస్తున్నట్లు గుర్తించారు.గత మూడేళ్లుగా వరుసగా స్వల్ప భూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. భూ ప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 4వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చిన విషయం విదితమే.