Saturday, November 23, 2024

AP – రామ్ గోపాల వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా….

అమరావతి – సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన రెండు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్ తో కలిపి వచ్చే మంగళ వారం విచారణ చేస్తామని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.. కాగా, ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు దర్శకుడు వర్మ.. అయితే, గురువారం రోజు కూడా వర్మ ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరిపి తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసిన విషయం విదితమే.. దీంతో.. ఆర్జీవీ దాఖలు చేసిన అన్ని బెయిల్‌ పిటిషన్లపై విచారణ మంగళవారం చేపట్టనుంది ఏపీ హైకోర్టు..


కాగా, తనపై అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని తాజాగా హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే.. సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో ఆర్జీవీపై కేసులు నమోదు అయ్యాయి.. ఇక, ఇదే వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు అయ్యింది.. అయితే, ఆ కేసును క్వాష్‌ చేయాలని రామ్‌గోపాల్‌ వర్మ.. హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు.. విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది హైకోర్టు.. కానీ, ఈ కేసులో మూడు రోజుల క్రితం పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన ఆర్జీవీ డుమ్మా కొట్టాడు.. వారం రోజుల గడువు కోరారు.. దీంతో.. ఈ నెల 25న విచారణకు రావాలంటూ మరోసారి రామ్‌గోపాల్‌ వర్మకు నోటీసులు పంపించారు పోలీసులు.. అయితే, ఈ లోపుగానే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఆర్జీవీ.. ఇక, ఈ వివాదం ఇక్కడితో అయిపోయిందుకోవడానికి వీలులేదు. ఆర్జీవీపై మరిన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. కడప, అనకాపల్లిలో కొత్తగా కంప్లైంట్లు నమోదయ్యాయి. ఫిర్యాదుదారుల నుంచి కంప్లైంట్ రావడంతో విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు పంపించారు. అయితే.. తనకు వారం రోజులపాటు సమయం కావాలంటూ తన తరఫున న్యాయవాదులతో పోలీసులను రిక్వెస్ట్ చేశారు ఆర్జీవీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement