అమరావతి : ఏపీ ప్రభుత్వం వరద నష్టంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏపీలో వరదల కారణంగా 45 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మృతి చెందగా.. గుంటూరు జిల్లాలో 7 మంది, పల్నాడు జిల్లాలో ఒకరు, ఏలూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు.భారీగా పంటల నష్టం వాటిల్లిందని ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1,81,53,870 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 19,686 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం ఏర్పడింది. 3,913 కి.మీ మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయి. 558 కిలో మీటర్ల అర్బన్ రోడ్లు ధ్వంసమయ్యాయి. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో సహాయచర్యలు కొనసాగుతున్నాయి.