రాగల మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 25కిలో మీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం దక్షిణ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తుందని వివరించారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారని స్పష్టం చేశారు. అయితే తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొదని సూచించారు. వర్షంతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని, వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఉండవద్దని సూచించారు. స్థానిక అధికారులు సైతం ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఇప్పటికే వర్షాలతో నష్టపోయిన జిల్లాల్లో వానలు కురిస్తే చేతికందిన పంటి నీట మునుగుతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement