Tuesday, November 26, 2024

ఎపి పోర్ట్ ల హ‌బ్ – జ‌గ‌న్

అమ‌రావ‌తి – విశాఖలో అతిపెద్ద నౌకాశ్రయాల‌తో పాటు రాష్ట్రంలో మరో 10 గుర్తించిన ఓడరేవులు ఉన్నాయని, 170 టన్నులకు పైగా సరుకుల రవాణా జరుగుతోందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను ప్రధాని ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ సమావేశంలో వర్చువల్‌ ద్వారా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గుజరాత్ సీఎం విజయ్ రూపాని, ఫిక్కీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ, కార్గో రవాణాలో ఏపీ రెండో స్థానంలో నిలిచిందని సీఎం చెప్పారు. దేశీయ దిగుమతుల్లో 2030 నాటికి కనీసం 10 శాతం దిగుబడులు రాష్ట్రం నుంచి జరగాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. నౌకాశ్రయాలపై ఆధారపడి ఇటీవల రాష్ట్రానికి పలు పరిశ్రమలు వచ్చాయన్నారు. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేలా కొత్తగా రామాయట్నం, మచిలీపట్నం, భావనపాడు వద్ద హరిత క్షేత్ర ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం చెప్పారు. గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్ట్స్‌ ద్వారా పోర్టుల నిర్వహణ అత్యంత సులువు కానుందన్నారు. నౌకాశ్రయాలు, ఓడరేవులు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. పెట్టుబడులను విశేషంగా ఆకర్షించేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ఆక్వా వర్సిటీ ఏర్పాటుతో పాటు, 8 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement