Tuesday, November 26, 2024

బిజినెస్ లా మారిన ఏపీ రాజకీయాలు… భారత్ జోడో యాత్రలో రాహుల్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో పార్టీలు రాజకీయాలను బిజినెస్ లా చూస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలను అమలు చేయాల్సి ఉందని .. తాము అధికారంలోకి రాగానే అమలు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇచ్చిన హామీల్లో ఉందన్నారు. గతంలో జరిగిన విభజన కాకుండా.. భవిష్యత్ పై దృష్టి పెట్టాలన్నారు. ఏపీ రాజధానిపై రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు. ఏపీకి ఒకటే రాజధాని.. అదే అమరావతి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మూాడు రాజధానుల నిర్ణయం సరైనది కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేసి తీరుతామన్నారు. పోలవరం వల్ల వచ్చే ప్రయోజనాలను రైతులకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో రైతులు, కార్మికుల హక్కులు కాపాడతామన్నారు.

భారత్ జోడో యాత్రకు మంచి స్పందన !
భారత్ జోడో యాత్ర దేశ సమగ్రతకు సంబంధించిందని రాహుల్ స్పష్టం చేశారు. మా పార్టీ అందరిది. మేం దేశాన్ని కులం, మతం, ప్రాంతం ఆధారంగా విడదీయాలని చూడడం లేదన్నారు. తన దృష్టి అంతా భారత్ జోడో యాత్రపైనే ఉందన్నారు.. అందరినీ కలుస్తున్నాను.. వారి సమస్యలు వింటున్నాను.. భారత్ ఆర్థికవ్యవస్థను కాపాడాల్సి ఉందన్నారు. దేశంలో రూపాయిని బలోపేతం చేయాలి. దేశంలో వన్ జీఎస్టీ-వన్ ట్యాక్స్ రావాల్సి ఉందన్నారు. దేశంలో కుల రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రె్స పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నారని.. రాబోయే రోజుల్లో నేను ఎలాంటి పాత్ర పోషించాలనేది అధ్యక్షుడు నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ తెలిపారు. మల్లికార్జున ఖార్గే, తరూర్ ఇద్దరు సీనియర్లే అని, పార్టీలు అనుభవజ్ఞులని పార్టీలో అనుభవజ్ఞులన్నారు. ఎవరు ఎన్నికైన తమంతట తాము నిర్ణయం తీసుకునే శక్తి వారికి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి జర్నలిస్టులను ఎదుర్కొనే ధైర్యం ఉందన్నారు. వాస్తవాలు మాట్లాడే ధైర్యం ఉందని పేర్కొన్నారు. కానీ ప్రధాని మోడీ ఎప్పుడైనా పాత్రికేయుల సమావేశం నిర్వహించారా.. జర్నలిస్టులను ఎదుర్కొన్నారా అని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయన్నారు. శశిథరూర్ చేసిన విమర్శలపై రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రతి పౌరుడికి, కులం మతం ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రాతినిత్యం వహిస్తుందన్నారు. అలాగే ఓ బాధ్యత గల పార్టీగా ప్రజాస్వామ్య విధంగా ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. తమల వైసీపీ, టీడీపీ, బీజేపీ ఇలా ఏ పార్టీ కూడా ఎన్నికలు నిర్వహించలేదన్నారు.

వైఎస్ఆర్‌సీపీతో పొత్తుపై హైకమాండ్‌దే నిర్ణయం !
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అని మీడియా ప్రతినిధులు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అయితే ఆ విషయంలో నేను నిర్ణయం తీసుకోలేను. పార్టీ అధ్యక్షునిదే తుది నిర్ణయం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పొత్తుల విషయంపై పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఉన్నంత ప్రజాస్వామ్యం మరే పార్టీలోనూ లేదు. ఈ యాత్ర రాజకీయాలకు సంబంధించి కాదని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర ఏంటో అధ్యక్షుడు నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక అని జగన్ సొంత పార్టీ పెట్టక ముదు చెప్పారు. అదే సమయంలో గతంలో ప్రశాంత్ కిషోర్.. ఏపీలో వైఎస్ఆర్‌సీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదిక ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement