Wednesday, November 20, 2024

AP – ఏలేరు ముంపు గ్రామాల‌లో స‌హ‌య‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం – అధికారుల‌కు ప‌వ‌న్ అదేశం

అమ‌రావ‌తి – ఏలేరు వరద ముంపు ప్రభావితమైన 21 మండలాల్లోని 152 గ్రామాల్లో సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ . . దెబ్బ తిన్న రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కోరారు.

ఏలేరు వరద ముంపుపై అధికారులతో త‌న కార్యాల‌యం నుంచి ఆయ‌న నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను కోరారు.రై తులకు భరోసా కల్పించాల‌ని, . వైద్య సేవలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. అలాగే.. ప్రాణ నష్టం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని పవన్ అధికారులను ఆదేశించారు..

- Advertisement -

మరోవైపు .. నిన్న కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ, పంట పొలాలను పరిశీలించారు. ముఖ్యంగా ఏలేరుకు దిగువన గల సుద్దగడ్డవాగుకు వరద పోటెత్తడంతో స్థానిక కాలనీలు అన్నీ నీటిలో మునిగిపోయాయి. పడవలో వెళ్లి ముంపు ప్రాంతాలను పవన్ పరిశీలించారు. సుద్ధగడ్డ వాగు సమస్యకు ఇక్కడి ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి పరిష్కారం చూపుతానని పవన్‌ కల్యాణ్ స్థానికులకు హామీ ఇచ్చారు. ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలు ఇస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement