న్యూ ఢిల్లీ – ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీలో బిజీబిజీ గా ఉన్నారు. నేడు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టులు.. ఇతర అంశాలపై వారితో చర్చలు జరపనున్నారు. కాగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో పవన్ భేటీ అయ్యారు. ఎపి పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు… మొత్తం ఏడు పర్యాటల ప్రతిపాదనలను ఆయన ముందుంచారు.. అలాగే ఎపిలో పర్యాటక యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ఉపముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు..
కాగా, నేటి మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో.. సాయంత్రం 3:15 గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో.. 4:30కు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో… 5:15కు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో భేటి కానున్నారు. ఇక . బుధవారం ఉదయం పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమో తో సమావేశం కానున్నారు.