Tuesday, October 8, 2024

AP ప‌ల్లె పండుగ‌కు సిద్ధం కండి – ప‌వ‌న్ క‌ల్యాణ్

అమ‌రావ‌తి – ప్ర‌తి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని, కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని ఎపి ఉప‌ ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. .. పాలన మొదలైన తొలి వంద రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, ఎన్‌ఆర్ఈజీఎస్. ద్వారా రూ.4500 కోట్లు నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినందున నిధుల సమస్య ఉత్పన్నం కాదన్నారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. వివిధ జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ర్టంలోని పంచాయతీల్లో నిర్వహించే ‘పల్లె పండుగ’ కార్యక్రమంపై కీలక సూచనలు చేశారు.. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులను మొదలుపెట్టాలని అధికారులను గతంలోనే ఆదేశించారు.. గ్రామ సభలలో ఆమోదించిన పనులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనుల ప్రారంభం గురించి ఈ సమావేశంలో చర్చించారు.

- Advertisement -

13,326 పంచాయతీల్లోనూ ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారని, ఆ మేరకు చేపట్టే పనులు, పని దినాల వివరాలను అధికారులు తెలిపారు. ఇక, ఈ నెల 14వ తేదీ నుంచి వారం రోజులపాటు పనుల ప్రారంభాన్ని ఒక పండగలా చేయాలని ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 20వ తేదీ వరకూ పంచాయతీల్లో పనుల ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement