Friday, October 18, 2024

AP – ఏనుగుల దాడిలో రైతు మ‌ర‌ణం బాధాక‌రం – ప‌వ‌న్ క‌ల్యాణ్ ..

పీలేరు – అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలోని బందార్లపల్లెలో. ఏనుగుల వల్ల రైతు దుర్మరణం చెందటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఎపి డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్. ఏనుగుల సంచారం వల్ల రాజారెడ్డి అనే రైతు దుర్మరణం పాలైన ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో నేడు చర్చించారు. మృతి చెందిన రైతు కుటుంబాన్ని అటవీ శాఖ అధికారులు పరామర్శించి భరోసా ఇవ్వాలని ఆదేశించారు. మృతుని కుటుంబానికి అందాల్సిన నష్ట పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ అందించే కుంకీ ఏనుగులు వీలైనంత త్వరగా మన రాష్ట్రానికి వచ్చేలా చూడాలన్నారు.

పీలేరు లో ఘ‌ట‌న‌…

పీలేరు సమీపంలోని బందార్లపల్లెలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది.. అటవీప్రాంతం నుంచి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఏనుగులు గుంపు విధ్వంసం సృష్టించాయి.. దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఏనుగుల గుంపు పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి.. వరి పంటను తొక్కి నాశనం చేశాయి ఏనుగులు.. ఇక, ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందాడు.. పుంగనూరు నుండి పీలేరు వైపునకు వెళ్తున్న ఏనుగుల గుంపు.. పీలేరు సమీపంలో ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి..

ఏకంగా 15 ఏనుగులు గుంపు మామితోటలను ధ్వంసం చేసింది.. అయితే, మామిడి తోపు యజమాని రాజారెడ్డిని ఏనుగులు తొక్కి చంపేశాయి. దీంతో, ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. మరోవైపు ఏనుగుల గుంపు సృష్టించిన విధ్వంసంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు.. ఇక, ఆ ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు ఫారెస్ట్‌ అధికారులు. కాగా, ఇప్పటికే ఏనుగుల సమస్యపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ దృష్టిసారించిన విషయం విదితమే.. దీనిపై ఏపీ-కర్ణాటక మధ్య ఒప్పందాలు కూడా జరిగాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement