Monday, November 18, 2024

AP – హోం మంత్రి అనితకు ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లాస్….

క్రిమినల్స్​తో గేమ్స్​ ఏంటి?
l ఎవరైనా సరే తొక్కి నార తీయాల్సిందే
l కూటమి పార్టీ వాళ్లైనా సరే వదిలేయొద్దు
l పోస్టులు పెట్టి భావప్రకటన అంటారా?
l ఆ ఘటనలన్నింటికీ హోమంత్రిదే బాధ్యత
l పోలీసులు సైలెంట్​ అయితే ఎలా?.. l పదే పదే మాతో చెప్పించుకోవద్దు
l హోంశాఖ నాదగ్గరుంటే ఇలా ఉండేది కాదు.. ఉపముఖ్యమంత్రి ఆగ్రహం
l అదుపుతప్పిన శాంతిభద్రతలంటూ పవన్​ కళ్యాణ్​ ఉగ్రరూపం
పదవి ఉండొచ్చు, ఉండక పోవచ్చు.. పోరాడే శక్తి తగ్గదు
గత ప్రభుత్వ వారసత్వంతోనే నేరాలు ఘోరాలు
పోలీసుల్లో కంట్రోల్ తప్పింది..
సింగపూర్, దుబాయిలో రేప్​లు జరగవు
రేప్ చేస్తాం, చంపేస్తాం అంటే భావప్రకటన అవుతుందా
ముందు పోలీసుల్లో మార్పు రావాలి.. లేదో హోం బాధ్యతలు తీసుకుంటా
యూపీ తరహాలో చర్యలు తప్పవు.. పిఠాపురంలో డిప్యూటీ సీఎం ఫైర్​

ఆంధ్రప్రభ స్మార్ట్, పిఠాపురం: గత ప్రభుత్వ అలసత్వపు వారసత్వంతోనే రాష్ట్రంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయని, హోంమంత్రి తగిన చర్యలు తీసుకోవాలి, లేదంటే తానే హోం మంత్రి బాధ్యతలు తీసుకుంటాన‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. తాను బాధ్య‌త‌లు తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల చిన్నారులపై జరిగిన అఘత్యాలపై సీరియస్ అయ్యారు. పోలీసు వ్యవస్థను, హోంశాఖను తూర్పారబట్టారు. వీటన్నిటికి కారణం గత ప్రభుత్వ వైఖరిలోనే పోలీసులు తిష్టవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో సోమ‌వారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ₹14.48 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, ₹1.34 కోట్లతో పిఠాపురం దూళ్ల సంత ఆధునీకరణ, ₹4 కోట్లతో సుద్దగడ్డ బ్రిడ్జి పనులకు శంకుస్థాపనలు చేశారు. పట్టు రైతులకు ₹2.70 కోట్ల బకాయిల చెల్లింపుపై హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్​ ఆవేశంగా మాట్లాడారు..

పోలీసులే క్రిమినల్స్​ని వెనకేసుకు వస్తున్నారు..

రాష్ట్రంలో ఈ మధ్య చిన్నారులపై జరిగిన లైంగిక దాడులపై ఉప ముఖ్యమంత్రి పవన్​ తీవ్ర ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, ఆగ్రహం వ్య్తక్తం చేశారు. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల తీరు బాగా లేదని తూర్పార బట్టారు. ‘‘శాసనసభలో మాజీ సీఎం భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన భార్యను రేప్ చేస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంటికి వచ్చి ఆడపిల్లల్ని రేప్ చేస్తామన్నారు. వీళ్లందరినీ వదిపెట్టటంతోనే ఇప్పుడు మూడేళ్ల చిన్నారులను రేప్ చేసి చంపేస్తున్న ఘటనలు పెరిగాయి. క్రిమినల్స్​కి కులం ఉండదు, మతం ఉండదు. ఈ పోలీసులు క్రిమినల్స్​ను వెనకేసుకు వస్తున్నారు. అదేమంటే భావ ప్రకటన స్వేచ్ఛ అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ నేరాలన్నీ భావ ప్రకటన అవుతాయా? అని పవన్ ప్రశ్నించారు.

సహనాన్ని పరీక్షించొద్దు..

- Advertisement -

తెగేవరకూ లాగొద్దని ఇన్నాళ్లు ఊరుకుంటున్నా.. రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత హననం వేరు. ఈ తేడాను పోలీసులు ఎందుకు గుర్తించటం లేదని డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో 30వేల మంది మహిళలు అదృశమయ్యారు. కానీ అప్పటి సీఎం రోడ్డు మీదకు వచ్చి అవ్వల బుగ్గల నిమిరారే గానీ మహిళల వ్యథ పట్టించుకోలేద‌ని మండిప‌డ్డారు. ‘‘పోలీసు వ్యవస్థ కంట్రోల్ తప్పింది, సీఎంను చంపేస్తామంటే ఎందుకు వదిలేశారు. అప్పులు మాదిరిగా క్రైమ్ కూడా వారసత్వంగా మారింది. ఇళ్లల్లో రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన అని తెగే వరకూ లాక్కండి. సహనం ఎంతుందో.. తెగింపు అంతకంటే పది రెట్లు ఉంది. అధికారంలో ఉన్నామనే సంయమనం పాటిస్తున్నాం, ఇది చేతకాని తనం కాదు’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

లా అండ్​ ఆర్డర్​ కంట్రోల్​ తప్పింది..

రాష్ట్ర అభివృద్ధికి లా అండర్ ఆర్డర్ కీలకం. లా అండ్ ఆర్డర్ కంట్రోలు చేయాలని పది సార్లు చెప్పాం. కానీ క్రిమినల్స్ నే పోలీసులు వెనకేసుకొస్తున్నారు. క్రిమినల్ని బంధువు అంటే మడత పెట్టి కొట్టండి. ఎవరినీ వదలొద్దు. హోంమంత్రి అనితకు చెబుతున్నా, మీరు హోం మినిస్టర్. ఈ ఘటనలన్నిటీకీ మీరే బాధ్యత వహించాలని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందరు బాగుండాలని కోరుకుంటున్నాం,. నోటకి వచ్చినట్టు మాట్లాడితే.. భరించే ఓపిక చచ్చింది.. ఇక ఊరుకోం అని పవన్ కళ్యాణ్ అన్నారు.

పదవి ఉన్నా లేకున్నా ఒక్కటే.. హక్కుల కోసం పోరాడుతాం..

నిర్భయ కేసులో హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ దోషిఅంగచ్ఛేదనం చేయమన్నారు. దోషిని చంపేయాలని లోక్ సభలో ఎంపీలు కోరారు. సింగపూరు, దుబాయిలో రేప్ కేసులు ఎందుకు ఉండవు… సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇంటికి వెళ్లి లాక్కొస్తారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడుతాను అన్నారు. హోంశాఖను అడగలేక కాదు, హోంశాఖను తీసుకుంటో పరిస్థితులు మరోలా ఉంటాయి, యూపీ సీఎం యోగి తరహాలో పాలన ఉంటుంది అన్నారు. పదవి ఉండొచ్చు. పదవి ఉండొచ్చు. ఉండక పోవచ్చు. డిప్యూటీ సీఎం పదవితో కొత్తగా శక్తి రాలేదు.. దశాబ్దంన్నర పక్కనే ఉన్నాం, ఎన్నో అవమానాలు దిగమింగాం, కానీ మానవ హక్కుల కోసం పోరాడే శక్తి మాకు ఉంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement