Wednesday, January 22, 2025

AP – రోడ్డు ప్ర‌మాద బాధిత కుటుంబాలకు అండ‌గా ఉంటాం – ప‌వ‌న్ కల్యాణ్

వెల‌గ‌పూడి -కర్ణాటకలోజ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంతో ఎపికి చెందిన న‌లుగురు వేద పాఠ‌శాల‌కు చెందిన విద్యార్ధుల‌తో స‌హా అయిదుగురు మృత్యువాతపడ్డారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ, కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో న‌లుగురు వేద పాఠశాల విద్యార్థులు, ఆ వాహన డ్రైవర్ మృతి చెందడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడించారు.


కర్నూలు జిల్లా మంత్రాలయంలోని వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు హంపిలో ఆరాధనోత్సవానికి వెళుతూ ఈ ప్రమాదానికి గురయ్యారని తెలిసిందని వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని… మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ భ‌రోసా ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement