గంజాయి సాగు వద్దు
ఇది ఆదాయ మార్గం కాదు
టూరిజంతో సంపద పెరుగుతుంది
రెండు ఇళ్లు కట్టండి..
పర్యాటకులకు అద్దెకు ఇవ్వండి
డోలీ లేని రాష్ట్రంగా మారుస్తాం
ప్రధాని పథకంతోనూ గిరిజనానికి ఆసర
ఏపీ సీఎం సహకారం అపారం
అనంతగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రభ స్మార్ట్, బల్లగరువు
గంజాయి ఆదాయ మార్గం కాదు..గంజాయి సాగుతో దుష్ఫలితాలు ఎక్కువ. అందుకే యువత గంజాయి సాగు చేయవద్దు. గిరిజనులకు ఉపాధి కరవు కాదు. టూరిజం అభివృద్ధితో సంపద సృష్టించవచ్చు. అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువు గ్రామంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతగిరి బల్లగరువు నుంచి రెడ్డిపాలెం వరకూ రూ.5.8 కోట్లతో 5.6 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అంతక ముందు డోలీ మోత మోసే రెండు కిలోమీటర్ల దూరంలోని బల్లగరువుకు కాలినడన చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు.. ఓ మహాత్ముడు నడిచినేల. ఆయన పోరాడిన ఈ నేలలో డోలి రహిత గ్రామాలుగా మార్చటమే తమ ధ్యేయం అన్నారు. 2017లో తాను జరిపిన పోరాట యాత్రలో పాడేరు, అరకు, ఆంధ్రా ఒడిశా బోర్డరులో పర్యటించానని, ఇక్కడి గిరిజనుల బాధను అర్థం చేసుకున్నానని, అధికారంలో లేక పోయినా గిరిజన తండాలకు తనను తీసుకువెళ్లారని వివరించారు. ప్రస్తుతం తాను . ప్రభుత్వంలో భాగస్వామ్యుడినంటే.. గిరిజనుడూ ప్రభుత్వంలో భాగస్వామే అన్నారు. మైళ్ల కొద్దీ కొండల్లో కోనల్లో డోలీలో నలుగురు ఓ గర్భిణీని, చావుబతుకుల్లోని మనిషిని తీసుకువెళ్లటమంటే… ఆ కష్టం నాకు తెలిసిందన్నారు.
అందుకే . సీఎం దగ్గరకు వెళ్లాను, ఢిల్లీలోనూ డోలీ గురించి చర్చించామని, ఏజెన్సీలో 95 శాతం గిరిజన గ్రామాలు ఉన్నాయని వివరించినట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రధాని చేపట్టిన గిరిజన మహాజాతి అభియాన్ పథకంతో గిరిజన గ్రామాలను అనుసంధానం చేసే అవకాశం దక్కిందన్నారు. వంద కంటే ఎక్కువ మంది జనం ఉంటే ఈ పథకం వర్తిస్తుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముదుకు వచ్చిందని, ప్రస్తుతం రూ.105 కోట్లుతో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశామన్నారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీలు ఇచ్చారు. ఏజెన్సీలో మ మాత్రం గెలవక పోయామన్నారు. కానీ తాము ఓట్ల కోసం పని చేయలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చే రూ. 100 కోట్లు కేవలం 4500 మంది మాత్రమే లబ్ధి పొందుతారన్నారు. ఇదే వంద కోట్లు కాకినాడలో ఖర్చు చేయవచ్చు. సీఎం చంద్రబాబు తన నియోజకవర్గానికి మళ్లించవచ్చు, కానీ మీ కష్టాల్లో కన్నీళ్లల్లో మేం ఉన్నాం. ఒక హైవేలో పనులు చేపట్టవచ్చు. కానీ ఓటు వేసినా.. వేయక పోయినా మేం జనానికే ఆసరగా ఉంటాం అన్నారు. ప్రస్తుతం పనులు 98 కిలోమీటర్ల మేరకు 19 పనులు చేపడుతున్నామని, ఇక . కేంద్రం నుంచి రూ. 72 కోట్లు మంజూరవుతాయన్నారు. ఈ రోడ్లతో 72 గ్రామంలో 249 మంది డోలీ బాధ నుంచి విముక్తి పొందుతారని పవన్ వివరించారు.
యువత తలచుకుంటే మార్పు ఖాయం
యువత తలచుకుంటే.. మార్పు వస్తుంది. గత ఎన్నికల్లో యువత మార్పు కోరింది. అందుకే రోడ్లు వచ్చాయి. సర్పంచులకు విలువ పెరిగింది. గిరిజనుల ఆదాయం పెరగాలి, రోడ్లు, నీటి అవసరాలు తీరాలి, అంగన్ వాడీ కేంద్రాలకు మరమ్మతులు చేయాలి ఇదీ సీఎం చంద్రబాబును కోరిన వరం అని పవన్ కళ్యాణ్ అన్నారు. తండాలో 300 మంది ఉంటే గానీ రోడ్డు లేదు. కానీ ప్రధాని మహాసంకల్పం మారింది. ఈ ఏజెన్సీలో 4612 పంచాయతీలు ఉన్నాయి. 2869 కోట్లు కావాలి. అని ప్రధానిని అడిగాం, ఇవ్వనీ సమకూరితే లబ్ధి చేకూరే గిరిజనుల సంఖ్య తక్కువే. కానీ ఏటా 350 కోట్లు ఖర్చు చేద్దాం గిరిజనులను బాగుచేద్దాం అని ప్రధానికి విజ్ఞప్తి చేశాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. 2017లో నీటి సమస్య, నీటి గెడ్డలు, నీటిలో పురుగులు గుర్తించాం. ఈ సమస్యల్నీ పరిష్కరించాలి, గ్రామాలను అనుసంధానం చేయాలి ఇదే తన లక్ష్యం అని డిప్యూటీ సీఎం వివరించారు. .జనవరి నుంచి ప్రధాని పథకంలో రోడ్లకు రూ. 250 కోట్లు మంజూరు చేస్తున్నారు.
పదేళ్లు కష్టపడ్డాను.. తిట్లు తిన్నాను
పదేళ్లు కష్టపడ్డాను. తిట్లు తిన్నాను. అవమానాలు భరించాను. పిల్లలను తిట్టారు. భార్యను బెదిరించారు. డోలీ ఊరికి రోడ్డు వేస్తే .. . తిట్లు తింటూ మీకోసం ఉన్నాం . మీ కోసం బాధ్యత తీసుకున్నాం. టూరిజం అభివృద్ధి చేయాలి. డోలీ రహిత జిల్లాగా మార్చుతాం. . గిరిజన గ్రామాల్లో 1250 కిలోమీటర్లకు దారి లేదు. రోడ్లు నిర్మిస్తాం. ఇక గంజాయి సామాజిక సమస్యగా మారింది. .గంజాయి మొక్కల్ని దేవతలకు ప్రసాదంగా పెట్టే గిరిజన సాంప్రదాయాన్ని కమర్షియల్ చేశారు. ఏపీని నెంబర్ వన్ గంజాయి కేపిటల్ గా మార్చారు. చిన్న పిల్లలకు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నరు. ఈ మధ్య ఓ. టీచర్ ను పిల్లలు కొట్టి చంపారు. కేవలం గంజాయి మత్తులోనే ఈ గొడవ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అందుకే గంజాయి సాగును అడ్డుకోవాలి. టూరిజంతో ఆదాయం పెరుగుతుంది, ఓ గ్రామంలో రెండు ఇళ్లు వసతికి ఇవ్వగలిగితే డబ్బులు వస్తాయి. కాఫీ సాగు, ఔషద మొక్కల సాగుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్తాం. అందుకే యువత గంజాయి సాగుకు మగ్గవద్దు అని పవన్ అన్నారు.