Tuesday, November 26, 2024

మున్సిపల్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్..

మున్సిపల్ ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఫలితాల కోసమే అందరు ఎదురు చూస్తున్నారు. ఆదివారం వెలువడే ఎన్నికల ఫలితాలపై బరిలో తలపడిన అభ్యర్థుల కంటే బెట్టింగ్ పాల్పడేవారిలోనే ఎక్కువగా ఆసక్తి కనిపిస్తోంది. ఏ వార్డులో ఎవరు విజయఢంకా మోగించబోతున్నారు.. ఎవరికి ఎక్కువ మెజారిటీ రాబోతుందో పందెం రాయుళ్లు ఆరా తీస్తున్నారు. పార్టీ నేతలు చెప్పిందో.. వార్డులో ఒకరిద్దరు అనుకున్న మాటలను నమ్మేయకుండా తామే స్వయంగా పోలైన ఓటింగ్‌ సరళిపై అధ్యయనం చేసి ఎవరిపై పందేలు కాయాలో నిర్ణయించుకుంటున్నారు. ఇందుకోసం కర్నూలు కార్పొరేషన్ తో పాటు నంద్యాల, ఆదోని, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, డోన్ మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేకంగా కొందరు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వీరుతో పాటుస్థానికంగా కూడా కొంతమంది పందేలు కట్టడానికి సిద్ధమవుతున్నారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా ఎన్నికల బెట్టింగ్ ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌లో బంతి బంతికీ పందేలు కాసినట్లే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుతోపాటు వారికి వచ్చే మెజారిటీపైనా సొమ్ములు పెడతారు. గత నెలలో ముగిసిన పంచాయతీ ఎన్నికల్లోనూ భారీగానే పందేలు కాశారు.

కర్నూలు కార్పొరేషన్ మాత్రం ఇన్ బెట్టింగ్ జోరు ఎక్కువగా ఉంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత కర్నూల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరగా ప్రస్తుతం కార్పొరేషన్ పై టిడిపి రెండో సారి జెండా ఎగర వేస్తుందని, అధికార పార్టీ వైసిపి పాగా వేస్తుందని బెట్టింగ్ ఎక్కువగా జరుగుతోంది. కార్పొరేషన్లో ప్రస్తుతం 50 వార్డులకు ఎన్నికలు జరగ్గా, ఇందులో టిడిపి 19, వైకాపా 23 వార్డులలో గెలుపొందు తాయన్న అంచనాలతో బెట్టింగ్ కడుతున్నారు.ఇక 19 వార్డులో వైసీపీ మేయర్ అభ్యర్థి రామయ్య గెలుపుపై పందెంరాయుళ్లు గుట్టుచప్పుడు కాకుండా రూ.లక్షల్లో పందేలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఫలితాలకు ముందే కోట్లలో పందేలు సాగడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement