Thursday, September 19, 2024

AP ఎమెల్సీ పోతుల కూడా వైసిపికి బైబై…

అమరావతి – ఎమ్మెల్సీ పోతుల సునీత వైసిపి అధిష్టానానికి భారీ షాకిచ్చారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె పార్టీ హై కమాండ్ కు లేఖ పంపారు. త‌క్ష‌ణం త‌న రాజీనామాను ఆమోదించాల‌ని అందులో కోరారు.. కాగా, త్వ‌ర‌లోనే త‌న భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని ఆమె ప్ర‌క‌టించారు.. ఇది ఇలా ఉంటే నేడు ఆ పార్టీకి చెందిన ఎంపి మోపిదేవి సైతం పార్టీకి బైబై చెప్పారు.. తాజాగా మ‌రో ఎంపి బీదం మ‌స్తాన్ రావు సైతం వైసిపిని వీడ‌నున్న‌ట్లు వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.. అలాగే వారి బాట‌లోనే మ‌రికొంద‌రు ఎంపీలు ఫ్యాన్ పార్టీకి షాక్ ఇవ్వ‌నున్న‌ట్లు ఢిల్లీ నుంచి వార్త‌లు విన‌వ‌స్తున్నాయి..

గతంలో ఆమె టీడీపీలో పని చేశారు. 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇండిపెంటెండెంట్ అభ్యర్థి ఆనుంచి కృష్ణ మోహన్ పై ఓడిపోయారు. అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పోతుల సునీతకు పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవం ఇచ్చారు.

అయితే 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కరణం బలరాం పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో ఎమ్మెల్యే కరణం బలరాంతో పాటు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీలో చేరారు.

అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిపాలవడంతో పార్టీ కార్యక్రమాలకు పోతుల సునీత క్రమేపీ దూరంగా ఉంటూవచ్చారు. తాజాగా ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆమె పంపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement