తిరుపతి ఉప ఎన్నికల్లో ఓడిపోతే 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తామని సవాలు విసిరారు ఏపీ మంత్రి అనిల్ కుమార్. సవాల్ ను స్వీకరించే దమ్ము ధైర్యం టిడిపికి ఉందా అని ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇప్పటికే ఈ సవాల్ విసిరారు. టిడిపి నేతలు తోకముడిచి పారిపోయారని విమర్శించారు. కరోనా నేపథ్యంలో సీఎం జగన్ తిరుపతి సభను వాయిదా వేస్తే టిడిపి నేతలు కారు కూతలు కూస్తున్నారని ఆరోపించారు అనిల్ కుమార్.
వకీల్ సాబ్ సినిమా టిక్కెట్లను పెంచి అభిమానులను ప్రజలను దోచుకున్నారని విమర్శించారు.వకీల్ సాబ్ ను వెనకేసుకుని చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబుది ఏ పార్టీ, ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడో చూసుకోవాలన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా 20 శాతం కూడా స్థానిక సంస్థలలో గెలవలేకపోయారు.
చంద్రబాబుకు కుప్పంలో నారా లోకేష్ కు మంగళగిరిలో ప్రజలు దూల తీర్చారు, అబ్బా కొడుకులకు అయినా బుద్ధి రాలేదు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఉన్నాయో టీడీపీ ఉన్నాయో తేలిపోతుంది. వందమంది సాబ్ లు వచ్చినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ఏమి చేయలేరు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దున్న లాగా పెరిగాడు గాని అతనికి మైండ్ పెరగ లేదని విమర్శించారు అనిల్ కుమార్.