Tuesday, December 3, 2024

AP – కుప్పంలో వైసిపికి ఎదురు దెబ్బ‌ – మునిసిప‌ల్ చైర్మ‌న్ సుధీర్ రాజీనామా


చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టిడిపిలో చేరిక
సైకిల్ ఖాతాలో కుప్పం మునిసిపాలిటీ

అమ‌రావ‌తి – ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో సుధీర్‌ టీడీపీ కండువా కుప్పుకున్నారు.


వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్‌ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సుధీర్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన లేఖను కుప్పం మున్సిపల్‌ కమిషనర్‌కు పంపించానని తెలిపారు. చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని పేర్కొన్నారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు వైసిపి చేతిలో ఉన్న కుప్ప మునిసిపాలిటీ సుధీర్ రాజీనామా చేయ‌డంతో టిడిపి చేతికి చిక్కింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement