Tuesday, November 19, 2024

AP – ఇసుక దందా ఆపండి : జేసీ ప్రభాకర్ రెడ్డి

ఇసుక అక్రమ రవాణా వద్దు
ఆ పాతిక మందీ నా వాళ్లే..
వీళ్లకు సాయం చేసేది ఎవరో తెలుసు
నాకోసం అయిదేళ్లు కష్టపడ్డారు
ఈ సంపాదన మీకొద్దు
ఏదో రకంగా సాయం చేస్తా
ఏసీబీ విచారణ జరుగుతోంది
టిప్పర్లు తిరిగితే వదిలిపెట్టేది లేదు
తస్మాత్ జాగ్రత్త

( ఆంధ్రప్రభ స్మార్ట్, తాడిపత్రి ) : ‘ఇసుక దందా వద్దు.. నాకు దూరం కావొద్దు’.. అని టీడీపీ నేతలకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు. తన నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన మాట్లాడారు. తాడిపత్రి నియోజకవర్గంలో 2.50 లక్షల మంది ఓటర్లు ఉంటే డబ్బులు కావాల్సింది కేవలం ఈ 25 మందికేనా అని ప్రశ్నించారు.

‘‘ గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణాపై గ్రీన్‌ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్లి మరీ పోరాడాను. నన్ను పట్టుకుని అన్ని ఊర్లు తిప్పి, పోలీస్‌స్టేషన్‌కు తిప్పితే.. మీ దయ వల్లే బయటకు వచ్చా. కానీ మీరే ఇసుక దందా చేస్తే ఎలా? అందుకే ఇసుక దందా చేసి నాకు దూరం కావొద్దు. ఇటీవల ఏసీబీ విచారణ జరిపింది. ఈ దందాలో మీకు వచ్చేది ఏమీ లేదు’’ అని స్పష్టం చేశారు.

- Advertisement -

‘‘మీకు ఇసుక అమ్మకం కూడా చేతకాదు.. మీరు ఎవరిని ఉపయోగించుకుంటున్నారో నాకు తెలుసు. గత ప్రభుత్వ హాయంలోని వ్యక్తుల సాయం లేకుండా ఒక ట్రిప్పును కూడా మీరు అమ్ముకోలేరు”అని అన్నారు.

‘‘నా దగ్గరి వాళ్లే 25 మంది ఇసుక దందా చేస్తున్నారు.. ఈ పనులు ఆపండి. నా కోసం ఐదు సంవత్సరాలు పని చేశారు. మీకు కావాలంటే వేరే విధంగా సహాయం చేస్తా.. కానీ ఇసుక దందా వద్దు.. నాకు దూరం కాకండి’’ అంటూ జేసీ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘టిప్పర్ ఓనర్లకు ఇదే నా హెచ్చరిక.. మీ బండ్లు బయటకు రావు . నా నియోజకవర్గంలో మాత్రం ఇసుక అక్రమ రవాణా చేయొద్దు. ఇసుక టిప్పర్‌లు తిరిగితే.. వదిలిపెట్టేది లేదు.. జాగ్రత్త’’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement