Wednesday, December 18, 2024

AP – జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌లో రూ.4వేల కోట్లు దుర్వినియోగం – పవన్

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ:గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం ₹4 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని విమర్శించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు.

ఈ వర్క్ షాప్లో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జల్ జీవన్ మిషన్ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్ర‌ధాని మోదీ క‌ల అదే..తాగు నీటి సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారని.. ఈ సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని చెప్పారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని అన్నారు.

- Advertisement -

ప్రతి ఒక్కరికీ నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమయిందని పవన్ అన్నారు. ప్రతి మనిషికి రోజుకు సగటున 55లీటర్ల పరిశుభ్రమైన నీరు ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ₹70 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement