ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఏపీ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2020 ర్యాంకింగ్స్ లో ఏపీ టాప్‌లో నిలిచింది. కేంద్రం టాప్ అచివర్స్‌లో 7 రాష్ట్రాలు ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. టాప్ అచివర్స్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రం మొత్తం 4 కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది.
సెకండ్ లిస్ట్‌లో 80-90శాతం స్కోర్‌తో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. అలాగే మూడో లిస్ట్‌లో 50 నుంచి 80శాతం స్కోర్‌తో అసోం, చత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌లు నిలిచాయి. 50శాతం కంటే తక్కువ స్కోర్‌తో ఢిల్లీ, బీహార్‌తో పాటూ మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.