ఏపీలో ఇంటర్మీడియట్ తరగతుల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. కరోనా కారణంగా గతంలో ఇంటర్ కాలేజీలు మూతపడ్డాయి. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వం.. ఇంటర్ క్లాసులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రత్యక్ష తరగతులను ఆగస్టు 16 నుంచి ప్రారంభించనున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలన్నీ ఆ రోజు తెరుచుకుంటాయని, కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించాలని ఆదేశించారు. కరోనా కారణంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం ఇటీవలే అందర్నీ పాస్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ సెకండియర్‌కు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్త కూడా చదవండి: జర్నలిజం చదివిన వారికి శుభవార్త