Friday, November 22, 2024

డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ అడ్మిషన్లపై ఏపీ హైకోర్టు స్టే

డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ ద్వారా సీట్ల భర్తీపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ అడ్మిషన్లపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. 70 శాతం కన్వీనర్, 30 శాతం యాజమాన్య కోటాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యాజ్యం దాఖలైంది. యాజమాన్య కోటా సీట్లను కన్వీనర్ భర్తీ చేయడంపై రాయలసీమ డిగ్రీ కళాశాలల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. పైగా, యాజమాన్య కోటాలో కోరుకున్న కాలేజీలకు వెసులుబాటు ఇవ్వలేదని ఆరోపించింది.

దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ నెల 20న చేపట్టే సీట్ల కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఆన్ లైన్ లో కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement