Tuesday, November 19, 2024

జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్

ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై సీరియస్ అయ్యింది. 2018 నుంచి 2019 వరకు ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి? ఎంత మొత్తం చెల్లించాలో కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. దీనికి సమాధానంగా కేంద్రం నుంచి డబ్బులు రాలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పారు. 2018-19 వరకు డబ్బులు రాకపోతే ఆ తర్వాత సంవత్సరాలకు బిల్లులు ఎలా వచ్చాయని కోర్టు ప్రశ్నించింది. రూ.5 లక్షల లోపు ఉన్న బిల్లులకు 20 శాతం తగ్గించి ఇస్తామని కోర్టుకు చెప్పి ఆ తర్వాత డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై సరైన జవాబు ఇవ్వకపోతే సీఎస్‌ను కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement