Friday, November 22, 2024

Ap news: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై తీర్పు రిజర్వ్

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. విచారణ అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. గతంలోనే పరిషత్ ఎన్నికలు జరిగినా హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటివరకు లెక్కింపు జరగలేదు. దీంతో పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసింది. అప్పట్లో ఎన్నికలకు తగిన సమయం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్న సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ఎన్నికలు రద్దు చేశారు. దాంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ అప్పీల్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వానదలు విన్న పిమ్మట తీర్పును తర్వాత వెల్లడించాలని నిర్ణయించింది.

ఈ వార్త కూడా చదవండి: పెగాసస్ వివాదంపై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

Advertisement

తాజా వార్తలు

Advertisement