Sunday, November 24, 2024

మంత్రులకు హైకోర్టు నోటీసులు

ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గవర్నర్‌తో ఉత్తర ప్రత్యుత్తరాల లీక్‌పై సీబీఐ విచారణ జరిపించాలని ఎస్​ఈసీ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రివిలేజ్ లెటర్స్ లీక్‌ అవలేదని గవర్నర్ సెక్రటరీ చెప్పారని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది వివరించారు. సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అయితే, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

గవర్నర్‌కు తాను రాసిన లేఖలు లీకవడంపై నిమ్మగడ్డ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. గవర్నర్‌కు తాను రాసిన లేఖ ఆధారంగానే మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స తనకు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారని పిటిషన్‌లో నిమ్మగడ్డ ఆరోపించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స పేర్లను ప్రతివాదులగా చేర్చారు. ఈ అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ హైకోర్టును కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement