Monday, November 25, 2024

బ్లాక్ ఫంగస్ మందుల కొరతపై ఏం చేస్తున్నారు?: హైకోర్టు

బ్లాక్ ఫంగస్ చికిత్సకు అతి ముఖ్యమైన ఇంజక్షన్ కొరతపై శుక్రవారం ఉదయం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందుల కొరతలపై ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన వివరాలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సోమవారం నాటికి పూర్తి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంజక్షన్ తయారీకి అవసరమైన ముడిసరకు లభ్యత తక్కువగా ఉందని న్యాయవాదులు తెలిపారు. కంపెనీలు ముడిసరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని వివరణ ఇచ్చారు. 9 లక్షలకు పైగా డోసులు అవసరమైతే కేవలం 2 లక్షల 17 వేలు మాత్రమే సరఫరా చేస్తున్నారన్నారు. రాష్ట్రాల వారీగా కేటాయింపుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. మరోవైపు ఆనందయ్య మందు గురించి విచారణ పూర్తి అయ్యిందని….సోమవారం ఆదేశాలు వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement