Tuesday, November 26, 2024

ఏపీ ఇంటర్​ ఫస్టియర్​ అడ్మిషన్ల షెడ్యూల్​ వ‌చ్చేసింది…

ఏపీ స‌ర్కార్ (2022-23) విద్యా సంవ‌త్స‌రం ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలను ఈ నెలలోనే ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కళాశాలల్లో తొలి ఏడాది ప్రవేశాల కోసం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 20వ తేదీ నుంచి అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు మొదలవుతాయని చెప్పింది. దరఖాస్తుల స్వీకరణకు జులై 20ని ఆఖరి తేదీగా నిర్ణయించింది. జూన్ 27 నుంచి అడ్మిషన్లు మొదలు పెట్టి.. జులై 20వ తేదీతో పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. జులై ఒకటవ తేదీ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపింది. కాగా, ఈ నెల తొలి వారంలో విడుదలైన ఏపీ పదో తరగతి పరీక్ష ఫలి తాల్లో 4 లక్షల 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6.15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement