ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోటాలోని 1238 బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన వయో పరిమితి జీవోను జారీ చేసే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జీవో రాగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే గ్రామ సచివాలయాల ద్వారా భారీగా ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం.. తాజాగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. గత నెలలోనే ఏపీపీఎస్సీ నుంచి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోటాలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. కానీ, ఈ విషయంలో చిన్నపాటి సాంకేతిక అడ్డంకిని ఏపీపీఎస్సీ గుర్తించింది. అభ్యర్థులకు వయో పరిమితిని సడలిస్తూ గతంలో ఇచ్చిన జీవో కాలపరిమితి గత మే నెలలో ముగిసిపోవడమే.. దీనికి కారణమని తేల్చింది వయో పరిమితికి సంబంధించిన జీవోను జారీ చేయాలని కోరుతూ ప్రభుత్వాన్ని కోరింది . బహుశా వారం పది రోజుల్లో ఏపీపీఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోను జారీ చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: తాజా అధ్యయనం: పిల్లల్లో జలుబులా కరోనా..