Sunday, November 24, 2024

Delhi | పుంగనూరు, అంగళ్లు దాడి కేసులో సుప్రీంకు ఏపీ సర్కార్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పుంగనూర్, అంగళ్లు దాడి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసులో నిందితులకు హైకోర్టు మంజూరు చేసిన మందుస్తు బెయిల్‌ను సుప్రీంలో సవాల్ చేసింది. పుంగనూర్, అంగళ్లు దాడి కేసులో నిందితులు దేవినేని ఉమ, పులివర్తి నాని, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి లకు ముందస్తు బెయిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో చల్లా బాబుపై ప్రభుత్వం 7 కేసులు నమోదు చేసింది.

నాలుగు కేసుల్లో చల్లా బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, మిగతా మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో చల్లా బాబు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పుంగనూరు, అంగళ్లు దాడుల కేసుల్లో మొత్తం 327 మందిపై కేసులు నమోదు చేసింది. వారిలో 97 మందిని ఇప్పటికే అరెస్టు చేసింది. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ తీసుకున్నవారిని కూడా అరెస్టు చేసేందుకు వారికి మంజూరైన బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement