Friday, November 22, 2024

ఏపీలో పింఛనుదారులకు తీపి కబురు..

రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వ తీపి కబురు అందించింది. పెన్షనర్లకు 3.144 శాతం డీఏ పెంచుతున్నట్టు వెల్లడించింది. పెంపుదల చేసిన ఈ కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా పెంపుతో రాష్ట్రంలో పింఛనుదారుల కరవు భత్యం 33.536 శాతానికి పెరిగింది. 2021 జులై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛను చెల్లించనున్నారు. బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నారు. ఇక 2019 జులై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని 2022 జనవరి నుంచి చెల్లించనున్నట్టు రాష్ట్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ పెంపు అనంతరం పింఛనుదారుల డీఏ 38.776 శాతానికి పెరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement