Monday, November 18, 2024

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ల కోసం ప్రభుత్వ పోర్టల్

సినిమా టికెట్ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. ఈ జీవో నిజానికి ఆగస్టు 31నే విడుదల చేసినా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

కాగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గురించి గతంలో సీఎం జగన్ ఆరా తీశారు. తెలుగు సినిమాల నుంచి పన్ను ఆదాయం రూ.20 కోట్లకు మించడం లేదని, తెలుగు పరిశ్రమ పన్నులు తక్కువ చెల్లించి మోసం చేస్తున్నారని జగన్ భావిస్తున్నారని, వందల కోట్ల కలెక్షన్లు అంటూ ఊదరగొట్టే వారు కేవలం రూ.20 కోట్లు పన్ను చెల్లించడం ఏమిటి అని విషయం మీద జగన్ అనుమానం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యం బి, సి సెంటర్లకు సంబంధించి చాలా తక్కువ పన్ను వస్తోందని సమాచారం. అందుకే రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా టిక్కెట్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తి అయ్యాయని టాక్. మరోవైపు తెలంగాణలో కూడా ప్రభుత్వం ఒక పోర్టల్ తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement