Monday, November 18, 2024

ప్రైవేట్ ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి అదే తప్పు చేస్తే క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపింది

ప్రైవేటు దవాఖానల్లో నిబంధనల అమలుపై వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు దృష్టి పెట్టాలని సూచించింది. నిబంధనలు ఉల్లఘించినట్లు తేలితే వెంటనే చర్యలకు ఉపక్రమించాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement