Tuesday, November 26, 2024

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు!


ఏపీలో ఇంట‌ర్‌, ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టులో విచారణ తర్వాత ఈ పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నారు. కోర్టు చెప్పినట్లు జూలై 31 లోగా పరీక్షల నిర్వహణ, రిజల్ట్స్ సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం ఆదేశించిన విధంగా ప‌ది రోజుల్లో ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేయ‌లేని కార‌ణంగా ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు విద్యాశాఖ మంత్రి ఆది మూల‌పు సురేష్ ప్ర‌క‌టించారు. విద్యార్థులు ఏ ర‌కంగా ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మంత్రి తెలిపారు. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో మార్కులు ఎలా ఇస్తామ‌న్న విష‌యాన్ని త‌ర్వాత ప్ర‌క‌టిస్తామ‌ని మంత్రి తెలిపారు. టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు ఎలా ఇవ్వాలన్న దానిపై విధివిధానాల రూపకల్పనకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్ర‌స్తుతం త‌మ వ‌ద్ద ల్యాబ్స్ మార్కులు మాత్ర‌మే ఉన్నాయ‌ని మంత్రి సురేష్ వివరించారు. జులై 31 లోపే ఫలితాలు ప్రకటించడం ఆచరణలో కష్టమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం లోపం లేదని, అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రయత్నించామని చెప్పారు. అయితే, సుప్రీంకోర్టు సూచన మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నామని మంత్రి సురేష్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement