Saturday, November 23, 2024

ఏపిలో కరోనా నియంత్రణకు 5 మంత్రులతో కమిటీ

ఏపీలో కోవిడ్ నివారణకు పర్యవేక్షణ, పటిష్టంగా వ్యాక్సినేషన్ అమలు, కమాండ్ కంట్రోల్ ను పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 5 మంత్రులతో ఒక కమిటీని నియమించింది. ఈ నెల 22వ తేది గురువారం ఉదయం 11గంటలకు మంగళగిరిలోని ఏపిఐఐసి బిల్డింగ్ 6వ ఫ్లోర్ లోని కాన్ఫరెన్స్ హల్లో మంత్రులు కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ కమిటీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా వ్యవహారిస్తారు. సభ్యులుగా రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఉంటారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు, హాస్పిటల్స్ లో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, కమాండ్ కంట్రోల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పలువురు ఉన్నతాదికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

కాగా, ఏపీలో కరోనా కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 37,922 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరుతో పాటు నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement