Saturday, November 23, 2024

టీటీడీ బోర్డు స్థానంలో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జీవో జారీ చేసింది. స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా టీటీడీ ఈవో, డిప్యూటీ చైర్మన్‌గా జేఈవో కొనసాగుతారు. కొత్త బోర్డు వేసేవరకు స్పెసిఫైడ్‌ అథారిటీ అమల్లో ఉంటుందని  ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 20తో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగిసింది. చైర్మన్ పదవీకాలం ముగియడంతో ట్రస్ట్ బోర్డు కాలం కూడా ముగిసింది. దీంతో ఈవో చైర్మన్ గా, ఏఈవో కన్వీనర్ గా స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాలక మండలికి ఉన్న అన్ని అధికారాలు స్పెసిఫైడ్ అథారిటీకి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల మొదటి వారానికి కొత్త పాలకమండలి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.  

ఇది కూడా చదవండి: స్కూల్స్ ఇప్పుడే ఓపెన్ చెయొద్దు: నీతి అయోగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement