Friday, October 18, 2024

AP – లైంగిక దాడి – పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

సీసీ కెమెరాలను ధ్వంసం చేసినా..
ఆధారాలు లభ్యం
అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం కేసు

( ఆంధ్రప్రభ స్మార్ట్, శ్రీ సత్యసాయి బ్యూరో) : అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం కేసులో సత్యసాయి జిల్లా పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఈ నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పరిధిలోని చిలమత్తూరు మండలం నల్ల బొమ్మనపల్లి సమీపంలో అత్తా, కోడలు పై నలుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సమాచారంతో జిల్లా ఎస్పీ వి రత్న ఘటన స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.

నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే కార్యాచరణ రచించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులలో నలుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపు లోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా నిందితులు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. వీరి రాకను పసిగట్టిన సీసీ కెమెరాలు ధ్వంసం కాలేదు. కొన్ని వీడియోలు నమోదు అయినట్లు తెలుస్తోంది. నిందితులు అందరూ కూడా పాతికేళ్లు, 30 ఏళ్లకు లోబడిన వారే ఉన్నట్లు సీసీ కెమెరాలు నమోదైన ఫుటేజీలు బట్టి తెలుస్తోంది. అంతే కాకుండా నిందితులందరూ కూడా పాత నేరస్తులని, ప్రధానంగా గంజాయి అమ్మకం, సేవించడం వంటి నేరాలు గలవారని ప్రచారం జరుగుతోంది.

బాధితుల రక్షణే లక్ష్యం – డీఎస్పీ మహేష్

- Advertisement -

చిలమత్తూరు మండలంలో అత్తా కోడలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో బాధితుల రక్షణ, భద్రత, ఆరోగ్యం తమకు ముఖ్యమని హిందూపురం డీఎస్పీ మహేష్ అన్నారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోందని, దీని వల్ల బాధితుల అంతరాయానికి ఇబ్బందులు కలిగించవద్దని డీఎస్పీ తెలిపారు. బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, కేవలం వైద్యులు ప్రభుత్వ ప్రతినిధులు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement