ఏపీ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈరోజు సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇక మంత్రులు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. రేపటిలోగా మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది.
ఈ నెల 19న అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలను కూడా అసెంబ్లీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.