Friday, November 29, 2024

AP – ఆదాయానికి మించిన ఆస్తులు – మాజీ డిప్యూటీ సిఎం ధ‌ర్మాన‌ పిఎ ముర‌ళి అరెస్ట్

శ్రీకాకుళం – మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పీఏ గోండు మురళిని ఎసిబి అధికారులు గ‌త అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అంత‌కు ముందు ఆయ‌న నివాసంలోనూ, బంధువుల ఇళ్ల‌లోనూ గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వ‌హించారు.. ఈ సోదాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. సుమారు రూ. 60 కోట్ల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు మురళిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి విశాఖపట్నం తరలించి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో న్యాయ‌మూర్తి ముర‌ళికి జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించారు.

ఇది ఇలా ఉంటే వైసీపీ నేత . ధర్మాన కృష్ణదాస్‌ మాజీ పీఏ గొండు మురళీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఇటీవల ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఏసీబీ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ అతుల్‌సింగ్‌ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆయ‌న ఉంటున్న శ్రీకాకుళం జిల్లాతోపాటు విశాఖలోనూ ఏకకాలంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన బృందంతో మురళీ నివాసంతోపాటు విధులు నిర్వహించిన చోట, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. అక్క‌డ లెక్కకు మించిన ఆస్థుల గుర్తించారు.. దీంతో అత‌డిపై కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement